పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2’ దర్శకుడు ఎవరు..?

పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2’ దర్శకుడు ఎవరు..?

Published on Oct 27, 2014 12:25 PM IST

pawan_kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి మెగా ఫోన్ పట్టుకుంటున్నారా..? ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాకు తానె దర్శకత్వం వహించానున్నారా..? గత రెండు రోజుల వెబ్ మీడియాలో ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. వరుస పరాజయాల తర్వాత పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో తెలియజేసిన సినిమా ‘గబ్బర్ సింగ్’. సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన హిందీ సినిమా ‘దబాంగ్‌’కు రీమేక్‌ అయినా ‘గబ్బర్ సింగ్’ కథలో చాలా మార్పులు చేశారు దర్శకుడు హరీష్ శంకర్. పవన్ వ్యక్తిగత ఇమేజ్ ప్రతిభింబించే డైలాగులు, ప్రతి సన్నివేశంలో పవన్ కళ్యాణ్ హీరోయిజం ఎలివేట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పవన్ మేనియాతో సూపర్ హిట్టయిన ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేయగానే అభిమానులలో అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి.

‘గబ్బర్ సింగ్ 2’ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాస్తున్నారని, దర్శకుడిగా సంపత్ నందిని తొలగించారని పుకార్లు చెలరేగాయి. అక్టోబర్‌ లో సంపత్‌ దర్శకత్వంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని నిర్మాత శరత్‌ మరార్‌ వివరణ కూడా ఇచ్చారు. ఇంకా షూటింగ్ మొదలవలేదు. తాజాగా పవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ‘గోపాల గోపాల’ పూర్తయిన తర్వాత ‘గబ్బర్ సింగ్ 2’ మొదలుపెడతారని సమాచారం. నిర్మాతలు దర్శకుడు ఎవరు అనే విషయంలో ఓ క్లారిటీ ఇస్తే బాగుటుంది.

తాజా వార్తలు