మహర్షి’ పై ఆసక్తి కనబరుస్తోన్న పవర్ స్టార్ !

Published on May 12, 2019 2:00 am IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మహేష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింజైగ్స్ ను రాబడుతున్నాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది. ఇక ఈ చిత్రాన్ని ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు చూసి ప్రశంసల వర్షం కురిపించారు.

కాగా తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా త్వరలో ‘మహర్షి’ని చూడబోతునట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రైతులకు సంబంధించిన సమస్యలకు ఏ విధంగా పరిష్కార మార్గం చూపారు అనే అంశాల పై పవర్ స్టార్ ఆసక్తిగా ఉన్నారట. అందుకే సినిమాను చూడాలనుకుంటున్నారట.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అలాగే ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :

More