పవన్ కళ్యాణ్ బ్యానర్ లో చరణ్ సినిమా ?

Published on Jul 6, 2020 5:19 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆర్ఆర్ఆర్ తరువాత తన కొత్త ఫిల్మ్ కి సంబంధించి ఇంకా సైన్ చేయలేదు. చరణ్ అభిమానుల సైతం తమ హీరో తరువాత సినిమా ఏమిటి ? డైరెక్టర్ ఎవరు ? అని ఇన్నాళ్ళు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఓ నిర్మాత రామ్ చరణ్ కోసం స్క్రిప్ట్ రాయడానికి త్రివిక్రమ్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత, చరణ్ తోనే త్రివిక్రమ్ సినిమా ఉంటుందని టాక్.

అయితే తాజా గాసిప్ ఏమిటంటే, పరణ్ కళ్యాణ్ కోసమే.. త్రివిక్రమ్ చరణ్ చిత్రాన్ని చేయడానికి ముందుకు వచ్చారట. పవన్ కల్యాణ్ బ్యానర్ లో చరణ్ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్టర్ గా ఈ సినిమా రానుంది. ఇది జరిగితే, ఇది మెగా అభిమానులకు శుభ వార్తనే. మరి ఈ వార్త నిజం అవుతుందేమో చూడాలి. ఇక పవర్ స్టార్ సైతం రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే.

‘పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్, అలాగే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఆయన వీటి తర్వాత హరీష శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చే ఏడాది కల్లా పూర్తైపోతాయి. పవన్ 2022లో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉండటంతో దర్శకుడు డాలీ కూడా సినిమా చేయడానికి పవన్ నుండి సానుకూల స్పందనే వచ్చిందని, అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2022లో వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

More