‘పవన్ – క్రిష్’ సినిమాకి కూడా డేట్ ఫిక్సా ?

Published on Jan 21, 2020 5:32 pm IST

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న ‘పింక్’ రీమేక్ షూటింగ్ నిన్నే మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా హడావుడిలో తర్జనభర్జన అవుతుండగానే పవన్ ఇంకో సినిమాను కూడా మొదలుపెట్టబోతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ నెక్స్ట్ చిత్రాన్ని క్రిష్ డైరెక్షన్లో చేస్తున్నారట, ఇందులో పవన్ ఒక దొంగ పాత్రలో కనిపిస్తాడట. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ తెలిసింది. ఈ నెల 27 నుండి ఈ సినిమా హైదరాబాద్‌ లో ఎలాంటి హంగమా లేకుండా షూటింగ్ ప్రారంభించబోతునట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకూ వాస్తవం ఉందో అధికారిక ప్రకటన వచ్చే వరకూ నమ్మలేం.

సంబంధిత సమాచారం :

X
More