వైరల్ : “వీరమల్లు” సెట్స్ లో పవన్ లేటెస్ట్ స్టిల్.!

Published on Dec 9, 2022 2:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ పీరియాడిక్ డ్రామా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంని విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండగా నిధి అగర్వాల్ అయితే హీరోయిన్ గా నటిస్తుంది. మరి పవన్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా మరియు భారీ బడ్జెట్ సినిమా కావడంతో మంచి అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి.

ఇక సినిమా పై అయితే మేకర్స్ ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వదులుతూ ఉండగా లేటెస్ట్ గా అయితే సినిమా నుంచి ఓ ఆన్ లొకేషన్ స్టిల్ సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ గా మారింది. వీరా లుక్ లోనే పవన్ రీసెంట్ గా రెడీ చేసిన గడ్డం గెటప్ తో ఇందులో కనిపిస్తున్నాడు. షూట్ బ్రేక్ లో అయితే లొకేషన్ లో ఉన్న ఇతర ఆర్టిస్టులతో పవన్ కనిపిస్తున్నాడు. దీనితో లేటెస్ట్ గా వచ్చిన ఈ పిక్ వెంటనే వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీ లో జరుగుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :