టాక్ – “వకీల్ సాబ్” లో పవన్ మార్క్ సర్ప్రైజ్ కూడా ఉందా?

Published on Jan 15, 2021 12:12 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఎప్పటి నుంచో ఒక ప్రత్యేకమైన టేకింగ్ లా కనిపిస్తుంది. సెట్స్ వల్లో తన టేస్ట్ వలనో కానీ అతని సినిమాల్లోని వాతావరణం కాస్త భిన్నంగానే అనిపిస్తుంది. మరి అలాంటి వాటికి తగ్గట్టుగానే మంచి ఆసక్తికర అంశాలనే పవన్ కూడా తీసుకుంటాడు. ముఖ్యంగా అయితే ఎప్పటి నుంచో పవన్ సినిమాలలో మంచి జానపద గేయాలు ఉండడం పైగా వాటిని తానే పాడడం వంటివి కూడా చూసాము.

లాస్ట్ చిత్రం “అజ్ఞ్యాతవాసి”లో కూడా ఓ హిట్ ట్రాక్ ను పవన్ పాడారు. అయితే మరి లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఇప్పుడు పవన్ కం బ్యాక్ చిత్రంగా శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన “వకీల్ సాబ్” చిత్రంలో కూడా పవన్ మార్క్ సర్ప్రైజ్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి అది పవన్ పాడిందా లేదా అన్నది తెలియరాలేదు కానీ సాంగ్ అయితే ఉందనే టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో కాలమే నిర్ణయించాలి. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :