పవన్ ఫ్యాన్స్ ఆ మూడుతో సరిపెట్టుకోవలసిందే..?

పవన్ ఫ్యాన్స్ ఆ మూడుతో సరిపెట్టుకోవలసిందే..?

Published on Jul 11, 2020 3:28 PM IST

Pawan Kalyan

రాజకీయాలలో బిజీ అయిన పవన్ ని చూసి ఆయన ఫ్యాన్స్ కొందరు చాలా నిరాశ చెందారు. ఆయన్ని మరలా వెండితెరపై చూడలేమని తెగ ఇబ్బందిపడ్డారు. కారణాలేమైనా పవన్ సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చి, వారు తీరదనుకున్న కల నెరవేర్చడానికి సిద్ధం అయ్యాడు. డబుల్ బొనాంజా అన్నట్లు, రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా మూడు సినిమాలు ప్రకటించారు. వాటిలో మొదటి చిత్రం వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో పాటు, త్వరలో విడుదల కానుంది.

కాగా క్రిష్ తో పీరియాడిక్ మూవీ మరియు హరీష్ శంకర్ తో ఓ మూవీ ఆయన చేయనున్నారు. ఐతే 2024 ఎన్నికల లోపు పవన్ మరో రెండు చిత్రాలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. దాని కోసం ఆయన ప్రణాళిక వేసుకోవడం జరిగింది. కానీ కరోనా వైరస్ ఆయన ప్రణాళికకు అడ్డుకట్ట వేసింది. దీనితో ఒప్పుకున్న మూడు చిత్రాలు పూర్తి చేయడమే కష్టంగా మారింది. కాబట్టి పవన్ నుండి 2024లోపు ఈ మూడు సినిమాలు మాత్రమే రానున్నాయి. ఇక 2024 ఎన్నికలు, ఆ ఫలితాల తరువాత పవన్ సినీ ప్రయాణం ఆధారపడి ఉంటుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు