పవన్ మ్యూజిక్ డైరెక్టర్ పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలట !
Published on Nov 5, 2017 12:00 pm IST

తమిల్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ప్రస్తుతం తెలుగులో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల సినిమాకి పనిచేస్తూనే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల సినిమాకు కూడా సంగీతం అందివ్వనున్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్దిరోజులుగా శంకర్, కమల్ హాసన్ ల కలయికలో రూపొందనున్న ‘ఇండియన్-2’ కి కూడా అనిరుద్ సంగీతం చేయనున్నారని వార్తలొచ్చాయి.

కానీ ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. అసలు ఈ ప్రాజెక్ట్ కోసం అనిరుద్ ని అనుకోవడంగాని, ఆయన్ను సంప్రదించడంగాని జరగలేదని, ఇంకా ఎవర్నీ నిర్ణయించలేదని చిత్ర యూనిట్ తెలిపారట. దీంతో రూమర్లకు చెక్ పడ్డట్లైంది. ఇకపోతే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook