రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్న పవన్ !

25th, April 2017 - 10:58:15 AM


రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న పవన్ కళ్యాణ్ నూతన చిత్రం యొక్క షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్లో పవన్, హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్, ఇతర నటీ నటులు కుష్బు, ,రావు రమేష్, మురళి శర్మ, రఘుబాబు వంటి వారిపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. దీంతో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న పవన్ ఈరోజు నుండి రెండవ షెడ్యూల్ ను మొదలుపెడతారట.

ఇది కూడా హైదరాబాద్లోనే మే 3వరకు జరుగుతుందని సమాచారం. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో పవన్ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనుండగా ఇందులో త్రివిక్రమ్ గత సినిమాల్లోలానే కడుపుబ్బా నవ్వించే మంచి కామెడీ ట్రాక్ ఉంటుందని, అలాగే ఒక స్పెషల్ సాంగ్ కూడానా ఉంటుందని తెలుస్తోంది.