వైరల్ : తన హిట్ డైరెక్టర్ కి తన ఫామ్ నుంచి గిఫ్ట్ పంపిన పవన్.!

Published on Jun 8, 2022 11:02 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన లేటెస్ట్ రెండు సినిమాలు కూడ బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో చాలా ఏళ్ల తర్వాత పవన్ నుంచి వచ్చిన చిత్రమే “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ సినిమా పింక్ కి రీమేక్ గా తెలుగులో పవన్ హీరోగా నివేత థామస్, అలాగే అనన్య నాగళ్ళ, అంజలి లు కీలక పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమాని ఫ్యాన్ ట్రీట్ లా దర్శకుడు వేణు శ్రీరామ్ సాలిడ్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాడు. అందుకే వేణు కి మాత్రం పవన్ అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్ ఫ్యామిలీ కి గాను పవన్ తన ఫామ్ లోని పండిన మామిడి పళ్ళను బహుమతిగా పంపినట్టు కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పోస్ట్ ని వేణు భార్య గాయత్రీ శ్రీరామ్ తన సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :