నాలుగు నెలల కఠిన దీక్ష చేపట్టిన పవన్.

Published on Jul 2, 2020 8:10 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న ఏకాదశి సంధర్భంగా చాతుర్మాస్య దీక్ష తీసుకున్నారు. ప్రజలకు మంచి జరగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ నాలుగు నెలలు కఠిన దీక్షను పవన్ కళ్యాణ్ చేయనున్నారు. దీక్షలో భాగంగా..బ్రహ్మ చర్యం, ఒంటి పూట భోజనం, భూతల శయనం, నదీ స్నానం వంటి అనేక నియమాలు పాటించనున్నాడు. మూడు సినిమాలు ఒప్పుకున్న పవన్ ఇలాంటి దీక్షతీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు.

పరిశీలిస్తే ఆయన ఇప్పట్లో ఈ చిత్రాల షూటింగ్స్ కి హాజరుకారేమో అనిపిస్తుంది. ఎటూ 2020 ముగిసే వరకు షూటింగ్స్ జరగవని తెలుస్తుండగా పవన్ కళ్యాణ్ ఈ దీక్ష తీసుకొని ఉండవచ్చు. పవన్ నటించిన వకీల్ సాబ్ 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలివుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరూపాక్ష.. చిత్రీకరణ దశలో ఉంది. హరీష్ శంకర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

సంబంధిత సమాచారం :

More