పవన్ సినిమా ఆగష్టు 26న నుండి.. !

Published on Jul 5, 2020 12:09 am IST


క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి సంబందించి అప్ డేట్ కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మొదట ఈ సినిమా క్లైమాక్స్ ను మొరాకోలో భారీ సెట్లలో భారీ స్థాయిలో షూట్ చేయాలని క్రిష్ భారీగా ప్లాన్ చేసుకునప్పటికీ.. కరోనా కారణంగా ఇప్పుడు ఆ ప్లాన్ సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. అందుకే మొరాకో ఎపిసోడ్ ను హైదరాబాద్‌లోనే భారి సెట్స్ వేసి క్లైమాక్స్ ను షూట్ చేయాలని క్రిష్ ఫిక్స్ చేశాడట. ఆగష్టు 26న నుండి షూట్ స్టార్ట్ చేయనున్నారట.

కాగా ఇప్పటికే ఈ సినిమా క్లైమాక్స్ సెట్స్ కి సబంధించి గ్రౌండ్ వర్క్ ను ప్రారంభించారని, హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో సెట్స్ వేయబోతున్నారని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు ఫ్యాన్స్ లో సినిమా పై ఆసక్తిని బాగా పెంచుతున్నాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. ఈ పిరియాడిక్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా.. అలాగే సినిమాలో యువరాణిగా నటించబోతుంది.

సంబంధిత సమాచారం :

More