పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కొత్త సినిమా లాంచింగ్ !
Published on Nov 5, 2016 1:16 pm IST

pawan-trivikram-m
టాలీవుడ్ పరిశ్రమలోని క్రేజీ కాంబినేషన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవడం ఖాయమనే గట్టి నమ్మకం , ప్రేక్షకుల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఉంది. గతంలో వీరిద్దరూ చేసిన ‘ జల్సా, అత్తారింటికి దారేది’ చిత్రాలు విజయాలే అందుకు కారణం. అందుకే వీరి కలయికలో రాబోతున్న సినిమా పై భారీ స్థాయి అంచనాలున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఈరోజే శనివారం హైదరాబాద్ లో లాంచ్ కానుంది. ఇప్పటికే పవన్, త్రివిక్రమ్ ఇద్దరూ లాంచింగ్ ఈవెంట్ వద్దకు చేరుకున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ వేడుకకు వీరితో పాటు మరికొంత మంది టెక్నీకల్ టీమ్ మాత్రమే హాజరుకానున్నారు.

ఇకపోతే ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ అందివ్వనున్నాడు. ఈ విషయంపై ఈ మధ్య మీడియాతో మాట్లాడిన అనిరుద్ ‘అ..ఆ.. సినిమాకి కొన్ని కారణాల వలన మ్యూజిక్ చేయలేదు. అయినా కూడా త్రివిక్రమ్ గారు నన్ను కన్విన్స్ చేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఒప్పించారు. ఈ సినిమా మామూలు సినిమాలలాగా కాదని, భిన్నంగా ఉంటుందని, కాబట్టి మ్యూజిక్ కూడా డిఫరెంట్ గా ఉండాలని, నేనైతే అలాంటి సంగీతం ఇవ్వగలనని అన్నారు’ అని చెప్పారు. ఇకపోతే ఈ సినిమాకి టైటిల్, హీరోయిన్, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తవడంతో సినిమా డిసెంబర్ లేదా జనవరిలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది.

 
Like us on Facebook