టెన్షన్ పడుతున్న పవన్…కారణం?

Published on Jul 7, 2020 2:52 pm IST

రెండేళ్లు పాలిటిక్స్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, కమ్ బ్యాక్ ఇస్తూ మూడు సినిమాలు ప్రకటించారు. అందులో మొదటి చిత్రం వకీల్ సాబ్ కాగా చిత్రీకరణ చివరి దశకు చేరింది. కేవలం 20రోజుల షూట్ మాత్రమే మిగిలివుందని సమాచారం. కాగా క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా సైతం చిత్రీకరణ దశలో ఉంది. ఇక హరీష్ శంకర్ తో చేయాల్సిన చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ మూడు చిత్రాలు త్వరగా పూర్తి చేసి రాజకీయాలపై దృష్టి సారించాలనేది పవన్ ఆలోచన.

ఐతే కరోనా వైరస్ కారణంగా పవన్ ప్రణాళిక కొంచెం దెబ్బతింది. షూటింగ్ కి బ్రేక్ పడడంతో పాటు, వైరస్ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది. 2024లో ఎన్నికల నేపథ్యంలో 2022 కల్లా కమిటైన చిత్రాలు పూర్తి చేసి..రెండేళ్లు ముందు నుండే పార్టీని పరిష్ఠటం చేసి, ఎన్నికలకు సిద్ధం అకావాలనేది పవన్ ప్లాన్ కాగా, అది ఇప్పుడు తారుమారయ్యేలా కనిపిస్తుంది. దీనితో వైరస్ ప్రభావం తగ్గిన వెంటనే వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేయాలని దర్శకులకు సూచించారట పవన్.

సంబంధిత సమాచారం :

More