లేటవ్వచ్చేమో గాని పవన్ రావడం పక్కా

Published on Nov 20, 2019 2:45 pm IST

పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా చేస్తారా లేదా అనేది ఇప్పుడు టాలీవుడ్ లో మిలియన్ డాలర్ క్వశ్చన్. కొన్ని రోజులుగా పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నారంటూ జోరుగా మాధ్యమాలలో ప్రచారం జరిగింది. ఇంకా ఆ వార్తలకు బ్రేక్ ఐతే పడలేదు. పవన్ పింక్ మూవీ రీమేక్ చేస్తుండగా, ఆ మూవీ టైటిల్ లాయర్ సాబ్ అని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు అనే అనుమానం కలుగుతుంది. అలాగే అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా మీడియా కథనాలు రాస్తున్నారా అనే సందేహం కూడా వస్తుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ సినిమా చేసేది ఖాయమే నట. కాకపోతే కొంచెం రాజకీయ వేడి చల్లారినాక పవన్ మూవీ ప్రారంభిస్తారట. ఆ చిత్రం దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మించే పింక్ రీమేక్ కావచ్చు, లేదా ఏఎమ్ రత్నం నిర్మాత దర్శకుడు క్రిష్ తెరకెక్కించే మూవీ ఐనా కావచ్చు. కాబట్టి పవన్ రావడం లేటవచ్చేమో గానీ..,రావడం మాత్రం పక్కా…,అని సమాచారం.

సంబంధిత సమాచారం :

More