అజిత్ సక్సెస్ అయ్యాడు.. మరి పవన్ ?

Published on Oct 23, 2019 12:48 pm IST

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడనే వార్తలు గత కొన్నాళ్ళుగా హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీఎంట్రీ ఎప్పుడు, ఏ సినిమాతో చేస్తాడు అనే అంశాలపై మాత్రం రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వార్తలకు తాజాగా ఇంకో కొత్త వార్త తోడైంది.

అదేమిటంటే పవన్ మునుపటిలా కాకుండా మంచి సందేశం ఉన్న సినిమా చేస్తే బాగుంటుందని, అందుకే హిందీలో అమితాబ్ బచ్చన్ చేసిన ‘పింక్’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఇదే సినిమాను కొన్నిరోజుల క్రితం తమిళంలోకి ‘నెర్కొండ పారవై’ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో స్టార్ హీరో అజిత్ అమితాబ్ పాత్రలో కనిపించారు. చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ఈ చిత్రాన్ని చేసినందుకు అజిత్ ప్రసంశలు అందుకున్నారు.

ఈ ఫలితాన్ని చూసే పవన్ ‘పింక్’ను రీమేక్ చేయాలని, అదే అన్ని విధాలా అర్థవంతంగా ఉంటుందని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే అజిత్ మాదిరిగానే పవన్ కుడా భారీ హిట్ అందుకోవడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ఇకపోతే ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తారని, బోనీ కపూర్, దిల్ రాజులు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తారనే టాక్ ఉంది.

సంబంధిత సమాచారం :

X
More