గాన కోకిల మృతి పై బన్నీ, పవన్ స్పందన !

గాన కోకిల మృతి పై బన్నీ, పవన్ స్పందన !

Published on Feb 6, 2022 7:35 PM IST


భారతీయ గాన కోకిల లతా మంగేష్కర్ ఇక లేరు. కాగా ఆమె మృతి పట్ల ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.. ‘ఇది విచారకరమైన రోజు. ఒక శకం ముగిసింది. నైటింగేల్ ఆఫ్ ఇండియా లతామంగేష్కర్ జీ ఇక లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆమె తన పాటల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

అలాగే పవన్ కళ్యాణ్ కూడా లతా మంగేష్కర్ మృతి పట్ల స్పందిస్తూ.. ‘భారతీయ సినీ సంగీత లోకంలో ధ్రువతార గాన కోకిల లతా మంగేష్కర్ గారు తుదిశ్వాస విడిచారన్న విషయం తీవ్ర ఆవేదనను కలిగించింది. లతాజీ అస్తమయం భారతీయ సిని సంగీతానికే తీరని లోటు. అనారోగ్యం నుంచి కోలుకొని ఇంటికి వెళ్ళారని తెలుసుకొని స్వస్థత చేకూరింది అనుకున్నాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. లతాజీ పాటకు భాషాబేధం లేదు. ఆ గళం నుంచి వచ్చిన ప్రతీ గీతం సంగీతాభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.

వేలాది గీతాలు ఆలపించిన లతాజీ స్వరం దైవదత్తం అనిపిస్తుంది. తెలుగులో కేవలం రెండు పాటలే పాడిన అవి మరిచిపోలేనివి. నిదురపోరా తమ్ముడా, తెల్లచీరకు పాటలు శ్రోతల్ని మెప్పించాయి. అంటే లతాజీ గానే కారణం. ఏడు దశాబ్దాల పైబడి సాగిన ఆమె గాన యజ్ఞం.. బాల్యం నుంచి ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని తను నిలిచి గెలిచిన తీరు స్ఫూర్తిదాయకం. దైవభక్తి మెండుగా కలిగిన లతాజీకి సద్గులు ప్రాప్తించాలని, ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తు్న్నాను. వారి కుటుంబానికి నా తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’.. అంటూ పవన్ కళ్యాణ్ మెసేజ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు