పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీనే ఫైట్ అట !

Published on Feb 14, 2020 12:59 am IST

‘పింక్’ రీమేక్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే కీలక సిన్నవేశాలను షూట్ చేసిన పవన్ కళ్యాణ్ పై ఒక పవర్ ఫుల్ ఫైట్‌ను చిత్రీకరించారట. సినిమా కూడా ఈ ఫైట్ మీదే ఓపెన్ అవుతుందట. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడనున్న తొలి సీన్ ఫైట్‌ కావడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే విషయమే. అలాగే ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు స్క్రిప్ట్ లో చాలానే మార్పులు చేశారు.

ఇక చిత్రబృందం ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. దాదాపు ఈ సినిమాకు ‘వకీల్ సాబ్’ టైటిలే ఫిక్స్ అయ్యేలా ఉంది. ఇదే టైటిల్ ను ఉగాది రోజున రివీల్ చేయనున్నారు. ఇక ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు డిసైడ్ అయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. అన్నట్టు ప్రెజెంట్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ను అందిస్తున్నాడు.

ఇకపోతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాను చేస్తిన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హరీష శంకర్ దర్శకత్వంలో కూడా ఇంకో కొత్త సినిమాకుచేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More