పవన్ సినిమా షూటింగ్ ముగిసేది అప్పుడే !

Published on Feb 20, 2020 3:00 am IST

పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న ‘పింక్’ తెలుగు రీమేక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ మొదటి వారాం కల్లా పూర్తి కాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ‘వకీల్ సాబ్’ టైటిలే ఫిక్స్ అయ్యేలా ఉంది. ఇదే టైటిల్ ను ఉగాది రోజున రివీల్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు డిసైడ్ అయ్యారు.

కాగా ఈ తేదీ వెనుక ఒక సెంటిమెంట్ ఉంది. అదే ‘గబ్బర్ సింగ్’. ఈ చిత్రాన్ని అంతా పవన్ కమ్ బ్యాక్ మూవీ అంటుంటారు. ఇది మే 11న విడుదలై ఇండస్ట్రీ హిట్ అయింది. అందుకే దిల్ రాజు పవన్ రీఎంట్రీ చిత్రాన్ని కూడా అదే నెలలో విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మే 15ను విడుదల తేదీగా నిర్ణయించారట. ఇకపోతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాను చేస్తిన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :