ఈ ఏడాదికి ఆ భాద్యత పవన్ దే..!

Published on Jul 7, 2020 6:56 pm IST


కరోనా వైరస్ కారణంగా చిత్ర పరిశ్రమ ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. చాలా వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ కి భయపడి…అనుమతులు లభించినా షూటింగ్స్ నిర్వహించడం లేదు. ఈ మధ్య వరుసగా కొందరు టీవీ నటులు కరోనా బారిన పడ్డారు. దీనితో పెద్ద హీరోలు షూటింగ్ కి హాజరయ్యే ఆలోచన వదిలివేశారు. చాలా మంది స్టార్ హీరోలు ఇక షూటింగ్ కి హాజరయ్యేది 2021లోనే ఫిక్సయ్యారని సమాచారం.

యంగ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్, బన్నీ, మహేష్ మరియు ప్రభాస్ షూటింగ్స్ మొదలుపెట్టినా వాటి విడుదల 2021లోనే. కాబట్టి ఈ ఏడాదికి థియేటర్స్ తెరుచుకుంటే మొదట దిగే స్టార్ హీరో ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలివున్న ఈ మూవీ షూటింగ్ ఖచ్చితంగా ఈ ఏడాదే ఉంటుంది. ఒక వేళ థియేటర్స్ తెరుచుకోకున్నా…ఓ టి టి లో నైనా వకీల్ సాబ్ విడుదల అవుతుంది.కాబట్టి 2020 కి పెద్ద సినిమాతో వచ్చి అలరించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ దే.

సంబంధిత సమాచారం :

More