ఆర్ ఎక్స్100 భామ రెడ్ అలెర్ట్ …!

Published on Aug 11, 2019 12:03 pm IST

ఆర్ ఎక్స్ 100 మూవీతో యూత్ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు హీరోయిన్ పాయల్ రాజపుత్. ఆమె మొదటి సినిమాలోనే నెగెటివ్ షేడ్స్ లో ఉండే కొంచెం బోల్డ్ రోల్ చేసి ఆకట్టుకున్నారు. కార్తికేయ హీరోగా, నూతన దర్శకుడు అజయ్ భూతిపతి తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డ్ వసూళ్లతో ఘనవిజయం సాధించింది.

కాగా నటి పాయల్ రాజ్ పుత్ తాజాగా “ఆర్ డి ఎక్స్ లవ్” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఇటీవల విడుదల చేడయడం జరిగింది. పాయల్ ఈ చిత్రంలో కూడా కొంచెం బోల్డ్ గా ఉండే పాత్రలో కనిపించనుందని సమాచారం. నేడు విడుదల చేసిన మరో పోస్టర్ లో రెడ్ డ్రెస్ లో పాయల్ గ్లామర్ చిందిస్తూ హీటెక్కిస్తోంది. ఆ ఫోటోలు చూస్తుంటే మళ్ళీ కుర్రకారు గుండెల్లో రెడ్ అలర్ట్ మొదలవడం ఖాయంగా కనిపిస్తుంది.

తేజు కంచెర్ల హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తుండగా,దర్శకుడు శంకర్ భాను తెరకెక్కిస్తున్నాడు. రాధన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :