పాయల్ కోరికలు మాములుగా లేవుగా..!

Published on Jul 8, 2020 2:00 am IST

ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ కి డైరెక్టర్ సందీప్ రెడ్డితో వర్క్ చేయాలని ఉందట. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న ఆ క్రేజీ డైరెక్టర్ తో మూవీ చేయాలనేది తన కోరిక అని ఆమె తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు. కబీర్ సింగ్ విడుదలై దాదాపు ఏడాది అవుతున్నా సందీప్ రెడ్డి వంగా కొత్త మూవీ ప్రకటించలేదు. ఆయన నెక్స్ట్ హీరో విజయ్ దేవరకొండతో మూవీ చేయనున్నాడని వార్తలు వస్తున్న తరుణంలో సందీప్ ఆమెకు అవకాశం ఇస్తారేమో చూడాలి.

పాయల్ ప్రస్తుతం తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తుంది . అలాగే తమిళంలో ఓ కామెడీ హారర్ మూవీ ద్వారా ఎంట్రీ ఇవ్వనుంది. విజయాల పరంగా వెనుకబడ్డ పాయల్ కి తెలుగులో అవకాశాలు బాగా తగ్గాయి. దీనితో ఈ అమ్మడు తన ఫోకస్ తమిళ పరిశ్రమపై పెట్టినట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More