వాళ్లిద్దరూ పోటీపడి మరి నటిస్తున్నారట

Published on Jul 31, 2019 11:01 am IST

హీరో నితిన్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “రంగ్ దే”. దర్శకుడు వెంకీ అట్లూరి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం టైటిల్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నారు. కాగా ఈ మూవీకి కెమెరా మెన్ గా పనిచేస్తున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ఈ మూవీపై ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

“నితిన్,కీర్తి సురేష్ ల నటన అత్యున్నతంగా, గుర్తుండిపోయేలా ఉంది. 2020 సంవత్సరం మాజీవితాలను రంగుల మయం చేయనుంది” అని ట్వీట్ చేశారు. “రంగ్ దే” చిత్రం కొరకు హీరో నితిన్,కీర్తి సురేష్ పోటీపడి మరీ నటిస్తున్నారని ఆయన ట్వీట్ చెప్పకనే చెబుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుందని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :