నవరస నుండి మరొక పోస్టర్ విడుదల!

Published on Aug 1, 2021 6:35 pm IST


మణిరత్నం క్రియేషన్ లో మణిరత్నం మరియు జయేంద్ర పంచప కేశన్ లు కలిసి నిర్మిస్తున్న వెబ్ సిరిస్ నవరస. ఈ వెబ్ సీరీస్ మొత్తం తొమ్మిది ఎపిసోడ్ లుగా తెరకెక్కించడం జరిగింది. అయితే తొమ్మిది రసాలని తొమ్మిది ఎపిసోడ్ లుగా తెరకెక్కించడం తో ఈ వెబ్ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వెబ్ సిరీస్ విడుదల కి సిద్దం అవుతుండటం తో ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను నవరస టీమ్ ఎక్స్ ప్రెస్ వేగంతో చేస్తోంది.

అయితే నవరసాలలో పీస్ కి సంబంధించిన పోస్టర్ ను నవరస టీమ్ తాజాగా విడుదల చేసింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ ఎపిసొడ్ లో గౌతమ్ వాసుదేవ్ మీనన్, మాస్టర్ తరుణ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్ట్ 6 వ తేదీన ఈ నవరస వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి రానుంది.

సంబంధిత సమాచారం :