కలెక్షన్స్ : ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ !

కలెక్షన్స్ : ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ !

Published on Jun 7, 2026 1:00 PM IST

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ప్రేక్షకులతో పాటు ఇటు అభిమానుల నుంచి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా తన మూడు రోజుల బాక్సాఫీస్ ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 236.7 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. మూడవ రోజుతో పోలిస్తే (నేడు) ఆదివారం నాటి షోలకు బుకింగ్స్ మరింత బలంగా జరుగుతున్నాయి. కాబట్టి, శనివారం కంటే ఈ రోజు సినిమా అధిక వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఎలాగూ వచ్చే వారం పెద్ద సినిమాలేవీ విడుదల కాకపోవడంతో, ‘పెద్ది’ చిత్రం థియేటర్లలో సుదీర్ఘకాలం పాటు విజయవంతంగా కొనసాగనుంది.

మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. కాగా ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ సంస్థ రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన ఈ సినిమాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ తదితరలు కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు