‘చూసీ చూడంగానే’.. హీరోగా నిర్మాత తనయుడు !

Published on Aug 4, 2019 12:51 pm IST

రాజ్ కందుకూరి ‘పెళ్లి చూపులు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఓ స్థానం కల్పించుకున్నారు. కాగా తాజాగా ఆయన తనయుడు శివ కందుకూరి కూడా హీరోగా పరిచయం అవ్వబోతున్న సినిమా టైటిల్ రివీల్ చేసింది చిత్రబృందం. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘చూసీ చూడంగానే’ అని టైటిల్ పెట్టారు. ఇప్పటికే షూటింగ్ పార్టును దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమాని సెప్టెంబర్ లో విడుదల చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో 96 ఫేమ్ వర్షా బొల్లమ్మ శివ కందుకూరి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. రాజ్ కందుకూరి నిర్మించిన ‘పెళ్లి చూపులు’ సినిమాను విడుదల చేసిన సీనియర్ నిర్మాత సురేష్ బాబే ఈ ‘చూసీ చూడంగానే’ సినిమాని కూడా విడుదల చేస్తున్నారు. శేష సింధురావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీత స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :