‘వెంకీ మామ’కు అదే కరెక్ట్

Published on Nov 17, 2019 10:00 pm IST

చాలారోజుల నుండి వెంకీ, నాగ చైతన్యల ‘వెంకీ మామ’ విడుదల విషయమై తీవ్ర తర్జన భర్జన జరుగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ ఆఖరున, జనవరి ఆరంభంలో చాలా సినిమాలు విడుదలకు రెడీగా ఉండటంతో విడుదల విషయంలో ఇన్నాళ్లు ఆలోచించిన నిర్మాత సురేష్ బాబు ఎట్టకేలకు తుది నిర్ణయాన్ని తీసేసుకున్నారట. చిత్రాన్ని డిసెంబర్ 13న విడుదల చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు.

ఎందుకంటే సినిమా పూర్తిగా సిద్దం కావడానికి ఇంకొన్ని రోజుల సమయం పడుతుంది. సో.. డిసెంబర్ నెలాఖరున విడుదల అనుకుంటే ‘రూలర్, ప్రతిరోజూ పండగే’ సినిమాలు 20న వస్తాయి కాబట్టి కుదరదు. అలాగే సంక్రాంతికి అనుకుంటే జనవరి 12న మహేష్, బన్నీల చిత్రాలు ఉన్నాయి. అందుకే డిసెంబర్ 20కి ముందే అంటే వెంకీ పుట్టినరోజు అయిన డిసెంబర్ 13వ తేదీయే అన్ని విధాల కరెక్ట్ అని, అప్పుడైతే వారం రోజుల సోలో వీక్ దొరికి వసూళ్లకు కలిసొస్తుందని, ఇంకా ఆలోచిస్తే ఫిబ్రవరికి వెళ్లాల్సి ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారట.

ఈ ఫ్యామిలీ ఎంటెర్టైనర్లో నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కె.ఎస్.రవీంద్ర ఈ చిత్రానికి దర్శకుడు.

సంబంధిత సమాచారం :

More