దర్శకుడి అవతారమెత్తనున్న ఫైట్ మాస్టర్

దర్శకుడి అవతారమెత్తనున్న ఫైట్ మాస్టర్

Published on Mar 25, 2015 12:57 AM IST

Peter-Hein
తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలకు ఫైట్ మాష్టార్‌గా పనిచేసిన పీటర్ హెయిన్, దర్శకుడి అవతారం ఎత్తనున్నారు. తనకు పేరు తెచ్చిన తెలుగు, తమిళ భాషల్లో కాకుండా తన మాతృ భాషైన వియత్నామీలో ఓ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రెండు సంవత్సరాల క్రితం నుంచే ఆయన సన్నాహాలు ప్రారంభించినట్టు స్పష్టం చేశారు.

పలువురు దర్శకులతో కలిసి సినిమాకి సంబంధించిన వివిధ విభాగాల పట్ల పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకున్నాకే దర్శకత్వం వైపు అడుగులేసినట్టు ఆయన తెలిపారు. మురారి సినిమా ద్వారా ఆయన వెండితెరకు యాక్షన్ డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. ఆయన యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేసిన సినిమాలు.. మగధీర, 1 నేనొక్కడినే చిత్రాలు కెరీర్లో గుర్తుంచుకోదగ్గవి. వీటితో పాటు మరెన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలకు పనిచేసిన అనుభవం పీటర్‌కు ఉంది. ప్రస్తుతం బాహుబలి చిత్రం కోసం ఆయన రూపొందించిన ఫైట్స్ ప్రేక్షకుడిని అబ్బురపరుస్తాయని సినీ వర్గాల టాక్.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు