పెట్టా కు తప్పని లీకుల బెడద !

Published on Oct 7, 2018 10:00 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘పెట్టా’ చిత్రానికి లీకుల బెడద తప్పడం లేదు. ఇటీవల ఈచిత్రం నుండి పలు స్టిల్స్ లీకుల రూపంలో బయటికి రాగ తాజాగా ఇప్పుడు మరో రెండు స్టిల్స్ లీకయ్యాయి . దాంట్లో ఓక స్టిల్ లో రజినీకాంత్ మీసాలు పెంచి యువకుడి లుక్ లో వున్నా ఫొటో తో పాటు ట్రెడిషనల్ లుక్ లో వున్నా త్రిష ఫొటోలు బయటికి వచ్చాయి. షూటింగ్ స్పాట్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న స్టిల్స్ ఎలా లీక్ అవుతున్నాయో అర్ధం కాకా చిత్ర యూనిట్ తలలు పట్టుకుంటున్నారు.

కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్నఈచిత్రంలో సిమ్రాన్, త్రిష , నవాజుద్దీన్ సిద్దిఖీ , విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :