ఆకట్టుకుంటున్న రజినీ కొత్త లుక్ !

Published on Oct 4, 2018 7:30 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న165వ చిత్రం ‘పెట్టా’ షూటింగ్ ప్రస్తుతం వారణాసి లో శరవేగంగా జరుగుతుంది. ఈచిత్రం యొక్క సెకండ్ లుక్ పోస్టర్ ను కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు. ఇక పోస్టర్లో రజినీ లుక్ ఆకట్టుకుంటుంది. మాస్ లుక్ లో తలైవా ను చూసి ఆయన అభిమానులు ఈసినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అదిరిపోతుందని అంచనా వేస్తున్నారు.

కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో సిమ్రాన్, త్రిష , విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకం ఫై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈచిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :