బాషా తరువాత పేటానే !

బాషా తరువాత పేటానే !

Published on Dec 27, 2018 4:00 AM IST

Petta4

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పెట్టా’ తెలుగు విడుదలపై క్లారిటీ వచ్చింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈచిత్రం సంక్రాంతికి విడుదలకానుంది. తెలుగులో ఈచిత్రాన్ని ‘పేట’పేరుతో విడుదలచేస్తున్నారు. ఇక రజినీ నటించిన చిత్రాల్లో ‘బాషా’ తరువాత తెలుగులో సంక్రాంతికి విడుదలవుతున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ చిత్రాల నుండి గట్టి పోటీ ఎదురుకానుంది. ఎందుకంటె పండగ సీజన్ లో ఎన్టీఆర్ కథానాయకుడు , వినయ విధేయ రామ , ఎఫ్ 2 చిత్రాలు విడుదలవుతున్నాయి. మరి ఈ సినిమాలను తట్టుకొని కలెక్షన్లను రాబట్టాలంటే సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప అది సాధ్యం కాదు. మరి ఈ చిత్రం తెలుగులో ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.

ఇక ఈనెల 28న ఈ చిత్రం యొక్క ట్రైలర్ విడుదలకానుంది. ‘జిగర్తండా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది.

తాజా వార్తలు