ప్రస్తుతం లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ఇప్పుడు భారీ సెట్స్ నడుమ శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుండగా ఇదే సెట్స్ నుంచి రీసెంట్ గా అనేక పిక్స్ బయటకి వచ్చాయి.
మరి లేటెస్ట్ గా ఆ ఆంజనేయుని ప్రతిమ ముందు నుంచి మరో అప్డేట్ బయటకి వచ్చింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ హీరోగా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి చందారపు కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన రీసెంట్ చిత్రమే “భజే వాయు వేగం”. మరి ఈ సినిమాకి బ్లెస్సింగ్స్ కోసం మెగాస్టార్ వద్దకు ఈ యంగ్ హీరో వెళ్ళాడు.
దీనితో విశ్వంభర సెట్స్ లో భజే వాయు వేగం కలయిక జరుగగా దీనితో పాటుగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకి టీజర్ ని బాస్ చిరంజీవి చేతులు మీదగా రిలీజ్ చేస్తున్నట్టుగా తాను అప్డేట్ అందించాడు. దీనితో విశ్వంభర సెట్స్ లో ఈ పిక్ అండ్ అప్డేట్ అయితే మంచి మూమెంట్ గా మారాయి. ఇక ఈ చిత్రాన్ని కూడా యూవీ వారే నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
The MEGA Blessing ????????
Our very own MEGASTAR @KChiruTweets Sir is launching our #BhajeVaayuVegam Teaser today at 2:25 PM ????#BossForBhajeVaayuVegam #BVVTeaser @Ishmenon @Dir_Prashant @RAAHULTYSON @UV_Creations @radhanmusic @RDRajasekar #KapilKumar @SatyaG_Editor @UVConcepts_… pic.twitter.com/NRShKb2nIR
— Kartikeya (@ActorKartikeya) April 20, 2024