ఫోటో మూమెంట్ : సాలిడ్ యాక్షన్ తర్వాత భీమ్లా, డానియల్ శేఖర్

Published on Oct 21, 2021 4:34 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న మాస్ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఆన్ లొకేషన్ స్టిల్ ఒకటి వైరల్ అవుతుంది.

భీమ్లా నాయక్, డానియల్ శేఖర్ అనే పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తున్న పవన్ మరియు రానా లు ఒకరు మంచంపై ఇంకొకరు ఎడ్ల బండిపై సేద తీరుతూ కనిపిస్తున్నారు. అలాగే వీరిని గమనిస్తే వారి డ్రెస్సింగ్ లో ఇద్దరికీ నడుమ ఓ అదిరే యాక్షన్ సీక్వెన్స్ ను కంప్లీట్ చేసినట్టు అర్ధం అవుతుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :