ఫోటో మూమెంట్ : “RRR” సెట్స్ నుంచి రామ్, భీమ్ ల బ్యూటిఫుల్ ఫ్రేమ్.!

Published on Apr 30, 2022 3:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యి స్యూర్ షాట్ ఇండియన్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అంతే కాకుండా ఈ సినిమాతో 1000 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ఇండియన్ సినిమా దగ్గర మరో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

మరి ఇప్పటికీ కూడా హవా కొనసాగిస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఓ ఫోటోని షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. సినిమా సెట్స్ లో భీమ్ ఎన్టీఆర్ అలాగే అల్లూరి రామ్ చరణ్ లు అలా కూల్ గా రిలాక్స్ అవుతూ నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. దీనితో ఫ్రేమ్ మరింత బ్యూటిఫుల్ గా మారింది. దీనితో ఇది చూసి ఎన్టీఆర్ మరియు చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :