ఫోటో మూమెంట్ : నట సార్వభౌమిని కరచాలనంలో మెగాస్టార్.!

Published on May 28, 2021 10:07 am IST

ఈరోజు సమస్తం తెలుగు చలన చిత్ర పరిశ్రమకే తన కంటి తీక్షణం తో వన్నె తెచ్చిన లెజెండరీ కథానాయకుడు స్వర్గీయ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఒక్క నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ సహా తెలుగు చలన చిత్ర అగ్ర కథానాయకులు సైతం స్మరించుకుంటున్నారు.

మరి అలా ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ మన టాలీవుడ్ మరో అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఒక అద్భుతమైన ఫోటో పెట్టి పలు ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నారు. ఈ ఫోటోలో తారక రాముని కరచాలనంతో ఎంతో వాత్సల్యం కనబరుస్తున్న మెగాస్టార్ ఆ సందర్భంలో ఎంత ఆనందమైన అభుభూతిని చెందారో సుస్పష్టంగా కనిపిస్తుంది.

మరి అలాగే ఈరోజు ఆ మహనీయుని స్మరించుకుంటూ “ప్రముఖ గాయకులు నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు, మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వ కారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవందక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటూ” సెలవు తీసుకుంటున్నా అని చిరు తెలిపారు.

సంబంధిత సమాచారం :