ఫోటోమూమెంట్ : డైరెక్టరైన కొత్తలో పూరీ స్టైల్..!

ఫోటోమూమెంట్ : డైరెక్టరైన కొత్తలో పూరీ స్టైల్..!

Published on Apr 15, 2015 11:38 PM IST

purijagannath
ఈ ఫోటో చూశారా? పూరీ జగన్నాథ్ రెండో సినిమా ‘బాచి’ సినిమా షూటింగ్ సందర్భంలోనిది. బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పూరీ.. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలను సినీ పరిశ్రమకు అందించి తెలుగులో టాప్ డైరెక్టర్లలో ఒకరుగా నిలిచారు. ఇన్నేళ్ళ ఈ ప్రయాణంలో పూరీ దర్శకుడిగా ఎంతగానో ఎదిగారన్నది వాస్తవం. ఆయన మేకింగ్ స్టైల్ దగ్గర్నుంచి, డైలాగులు, హీరో మ్యానరిజమ్స్ ఇలా అన్నింటా తనకంటూ ఒక స్టాండర్డ్ సెట్ చేశారు.

ఇదిలా ఉంటే సరిగ్గా గమనిస్తే పూరీ జగన్నాథ్ మేకింగ్ స్టైల్ మాత్రమే కాక తన స్టైల్ విషయంలోనూ పూరీ చాలా మారిన తీరు గమనించవచ్చు. ఇక ఈ ఫోటోలో పూరీతో పాటు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ను చూడొచ్చు. పూరీ జగన్నాథ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చార్మీతో జ్యోతిలక్ష్మి అనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు