ఫోటో మోమెంట్ : అల్లు అర్జున్ కి రామ్ చరణ్ స్పెషల్ బర్త్ డే విషెస్

ఫోటో మోమెంట్ : అల్లు అర్జున్ కి రామ్ చరణ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Published on Apr 9, 2024 1:01 AM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే నిన్న కావడంతో పలువురు ప్రేక్షకాభిమానుల తో పాటు అనేకమంది సినీ ప్రముఖులు ఆయనకు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బర్త్ డే విషెస్ ని తెలియచేసారు. అనంతరం తన ఇంటివద్ద సందడి చేసిన అనేక మంది అభిమానులని కలిసిన అల్లు అర్జున్ వారి ప్రేమకు ప్రత్యేకముగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇక కొద్దిసేపటి క్రితం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అల్లు అర్జున్ కు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియచేసారు. అల్లు అర్జున్ తో పాటు ఆయన తనయుడు అల్లు అయాన్ తో కలిసి దిగిన ఒక సెల్ఫీ పిక్ ని పోస్ట్ చేసారు రామ్ చరణ్. నీకు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ, ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, లవ్ యూ అంటూ రామ్ చరణ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు