మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం కానున్న సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా ‘రేయ్’. తను నటించిన రెండవ సినిమా ‘పిలా నువ్వులేని జీవితం’. మొదటి సినిమా ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల వాయిదా పడుతుండడంతో ముందు సెకండ్ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అపోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ కూడా తన పార్ట్ కి డబ్బింగ్ ఫినిష్ చేసాడు.
ఫైనల్ రషెస్ చూసుకున్న ఈ చిత్ర టీం సినిమా చాలా బాగా వచ్చిందని, కచ్చితంగా సినిమా ఆడియన్స్ ని మెప్పిస్తుందని చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా ఆడియో వేడుక అక్టోబర్ 25న అందరు మెగా హీరోల సమక్షంలో జరగనుంది. అలాగే ఈ చిత్ర టీం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని నవంబర్ 14న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు – హర్షిత్ కలిసి నిర్మిస్తున్నారు. ఎ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.


