మోదీ బయోపిక్ విడుదలతేదీ ఖరారు !

Published on Mar 16, 2019 10:05 am IST

‘సరబ్జిత్ , మేరీ కోమ్’ ఫేమ్ ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పిఎం నరేంద్ర మోదీ’. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా బోమన్ ఇరానీ ,దర్శన్ కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రం యొక్క విడుదల తేదీ ఖరారైయింది. ఎలక్షన్స్ టైం లో ఏప్రిల్ 12న ఈసినిమాని థియేటర్లలోకి తీసుకురానున్నారు.

సురేష్ ఒబెరాయ్ , సందీప్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :