సింగర్ మంగ్లీపై పోలీసులకు ఫిర్యాదు..!

Published on Jul 21, 2021 3:00 am IST


సింగర్ మంగ్లీ.. తన పాటలతో ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. కేవలం సినిమాల్లోని పాటలనే కాకుండా దసరా, బతుకమ్మ, శివరాత్రి వంటి పండగ పర్వదినాలకు సంబంధించి కూడా మంగ్లీ ప్రత్యేకమైన పాటలు పాడుతుంటుంది. అయితే ఈ ఏడాది బోనాలకు సంబంధించి కూడా సింగర్ మంగ్లీ ఓ ప్రత్యేకమైన పాటను పాడిన సంగతి తెలిసిందే. అయితే ఆమె పాడిన ఆ పాట ఇప్పుడు వివాదం రేపింది.

ఈ క్రమంలోనే బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారని మంగ్లీపై బీజేపీ నేతలు మండిపడ్డారు. అంతేకాదు బీజేపీ కార్పోరేటర్లు నేడు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. మంగ్లీపై కేసు నమోదు చేయాలని కోరుతూ, ఆమె పాడిన ఆ పాటను తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని వాళ్లు డిమాండ్ చేశారు.

సంబంధిత సమాచారం :