బిగ్ బాస్ హౌస్ లోకి పోలీస్ లు,ఆమె అరెస్ట్ తప్పదా?

Published on Jul 26, 2019 10:30 am IST

తెలుగులో బిగ్ బాస్ షో ఇటీవలే మొదలు కాగా తమిళంలో మాత్రం ఇప్పటికే 33ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని వాడివేడిగా దూసుకుపోతుంది. గత రెండు సీన్లతో పాటు ప్రస్తుత మూడవ సీజన్ కి కూడా లోకనాయకుడు కమల్ హాసనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఐతే తమిళ బిగ్ బాస్3 లో ఇంటిలోపలి వివాదాలకు మించి, ఇంటి సభ్యులు బయటివివాదాలతో వార్తలలో నిలుస్తున్నారు.కొద్దిరోజుల క్రితం బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన నటుడు విజయ్ కుమార్ కూతురు వినీత సొంత కూతురిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై పోలీసులు బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించడం జరిగింది. ఆ వివాదం ముగిసిందనే లోపే మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

బిగ్ బాస్ కాంటెస్ట్స్ లో ఒకరైన మీరా మిథున్, గతంలో దక్షిణ భారత అందాల పోటీలు నిర్వహించ తలపెట్టారు. కారణాలేమైనా ఆ ఈవెంట్ కార్యరూపం దాల్చలేదు. ఐతే ఆ కార్యక్రమంలో డ్రెస్ డిజైనింగ్ వర్క్ ఇప్పిస్తానని చెప్పి ఆమె తన వద్ద 50వేల రూపాయలు తీసుకున్నారని, ఇప్పుడు ఆ డబ్బులు తిరిగిచెల్లించడం లేదని,ఒక వ్యక్తి పోలీసులకు పిర్యాదు చేయగా, ఈ కేసు విచారణ కొరకు పోలీస్ లు బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు. మీరా మిథున్ ఈ కేసు విషయమై ముందస్తు బెయిల్ పొందినా కూడా పోలీసులు విచారణకు రావడం ఆసక్తికరంగా మారింది. ఆమెను అరెస్ట్ చేసే అవకాశం కూడా కలదని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :