స్టార్ హీరో సినిమాలో పొలిటికల్ టచ్ ?
Published on Mar 11, 2018 4:13 pm IST

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తన 62వ సినిమాను మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. అభిమానులు, సినీ వర్గాల్లో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓ కొత్త హడావుడికి తెరలేపింది. అదేమిటంటే ఇటీవల బయటికొచ్చిన ఈ చిత్రం యొక్క స్టిల్స్ ను బట్టి ఇందులో పొలిటికల్ టచ్ ఉండబోతోందనే చర్చ బయలుదేరింది.

ప్రస్తుతం తమిళనాట నడుస్తున్న వాడీ వేడి రాజకీయ పరిస్థితుల నైపథ్యంలో ఈ అంశమే కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవముందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. విజయ్ గత సినిమా ‘మెర్సల్’ లో కూడ జిఎస్టీ, డీమానిటైజేషన్ వంటి అంశాలను ప్రస్తావించి సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే.

 
Like us on Facebook