యూఎస్ లో మరో మార్క్ అందుకున్న “పొన్నియిన్ సెల్వన్” వసూళ్లు.!

యూఎస్ లో మరో మార్క్ అందుకున్న “పొన్నియిన్ సెల్వన్” వసూళ్లు.!

Published on Oct 24, 2022 3:04 PM IST

కోలీవుడ్ స్టార్ హీరోలు చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి అలాగే హీరోయిన్ లు త్రిష మరియు స్టార్ నటి ఐశ్వర్య రాయ్ లాంటి స్టార్స్ తో లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “పొన్నియిన్ సెల్వన్”. తమిళ నాట అయితే ఈ ఏడాదిలో మరో బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచి భారీ గ్రాసర్ గా నిలిచింది. మరి తమిళ్ లోనే కాకుండా యూఎస్ లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లు నమోదు చేయడం విశేషం.

మరి తమిళ్ వెర్షన్ నుంచి అయితే టోటల్ గా 6 మిలియన్ మార్క్ ని యూఎస్ లో అందుకోడమే పెద్ద సెన్సేషన్ అయితే లేటెస్ట్ గా ఈ చిత్రం 6.5 మిలియన్ మార్క్ ని టచ్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు వారు తెలుపుతున్నారు. దీంతో అయితే పొన్నియిన్ సెల్వన్ తమిళ్ నుంచి అయితే ఓ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే రెండో భాగం అయితే వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు