‘ఆచార్య’ ఇంటర్వెల్ లో పూజా హెగ్డే ఎంట్రీ !

Published on Apr 26, 2021 5:41 pm IST

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా బ్రేక్ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. సినిమాలో పూజా ఎంట్రీ ఇంటర్వెల్ సీన్స్ లోనే ఉంటుందని.. అంటే ఆచార్య ఇంటర్వెల్ కి చరణ్ చెప్పే ప్లాష్ బ్యాక్ లో పూజా కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది.

ఇక రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది. మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :