ప్రేక్షకులను కట్టిపడేస్తున్న పూజ హెగ్దే

ప్రేక్షకులను కట్టిపడేస్తున్న పూజ హెగ్దే

Published on Oct 18, 2014 10:34 AM IST

pooja-hegde
ఒక లైలా కోసం సినిమా ఎట్టకేలకు నిన్న విడుదలైంది. విడుదలైన మొదటిషో నుండి మంచి రివ్యూలను అందుకుంటూ హిట్ సినిమా బాటలో పయనిస్తుంది. ఈ సినిమాలో ప్రేమకదను తెరకెక్కించిన విధానాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సినిమా ప్రియులకు నాగచైతన్య, పూజా హేగ్దే నటన ఆకట్టుకుంటుంది. కష్టతరమైన పాత్రను చాలా ఇష్టంగా నటించింది

ప్రస్తుతం ‘ముకుందా’ షూటింగ్ లో ఈ భామ బిజీగా వుంది. ఈ సినిమా డిసెంబర్ లో విడుదలయ్యే సూచనలు వున్నాయి. ‘ఒక లైలాకోసం’ విజయంతో టాలీవుడ్ లో ప్రస్తుతం పూజాపై పై నిర్మాతల కన్ను పడింది. జాగ్రత్తగా కెరీర్ ని నిర్మించుకుంటే మంచి హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా వున్నాయి

తాజా వార్తలు