మరో బంపర్ ఛాన్స్ అందుకున్న పూజా..!

Published on Mar 30, 2020 12:03 pm IST

టాలీవుడ్ లో పూజ హెగ్డే స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఈ సంక్రాంతికి అల వైకుంఠపురంలో మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్స్ సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామాలో కూడా పూజ నటిస్తుంది. అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో కూడా పూజ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా కోలీవుడ్ లో పూజకి మరో బంపర్ ఛాన్స్ దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ హరి తెరకెక్కిస్తున్న అరువా చిత్రంలో సూర్య కి జంటగా పూజ హెగ్డే ని తీసుకొనే ఆలోచనలో ఉన్నారట. దాదాపు పూజ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిచడం ఖాయం అని తెలుస్తుంది. హరి-సూర్యలది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింగం సిరీస్ సూపర్ సక్సెస్ అయ్యింది.

సంబంధిత సమాచారం :

X
More