పవన్, మహేష్ ల సరసన ఆ స్టార్ హీరోయిన్?

Published on Jul 9, 2021 8:52 pm IST

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా టాప్ హీరోలే. వీరి సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాతో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హరీష్ శంకర్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి హీరోయిన్ గా పూజ హెగ్డే ను అనుకున్నట్లు గా తెలుస్తోంది. అయితే వీరి కలయిక లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి చరిత్ర సృష్టించిందో అందరికీ తెలిసిందే. వీరి కలయిక లో వస్తున్న చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

అయితే అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం లో కూడా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అయిన అలా వైకుంఠ పురంలో, అరవింద సమేత వీర రాఘవ చిత్రాల్లో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. అయితే వీటి పై ఇంకా అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. మరి వీటి పై దర్శక నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :