ప్రభాస్ 20 షూటింగ్లో జాయిన్ అయినా హీరోయిన్ !

ప్రభాస్ 20 షూటింగ్లో జాయిన్ అయినా హీరోయిన్ !

Published on Oct 7, 2018 7:40 PM IST

pooja hegde1

యంగ్ రెబల్ స్టార్ ఒక చిత్రం పూర్తి కాకూండానే మరో చిత్రాన్ని పట్టాలెకెక్కించాడు. సుజీత్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘సాహో’ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈచిత్రం పూర్తి కాకుండానే ప్రభాస్ తన 20 చిత్రంను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యొక్కషూటింగ్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతుంది. ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఇక తాజాగా ఈ ఫస్ట్ షెడ్యూల్ లో ఆమె జాయిన్ అయ్యింది. ప్రస్తుతం ప్రభాస్ – పూజా లపై కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

పీరియాడికల్ ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కువుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కొత్త లుక్ లో కనబడనున్నాడు. ఈచిత్రాన్ని గోపికృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తాజా వార్తలు