మరోసారి జిగేలు రాణి అవతారమెత్తిన పూజా హెగ్డే

Published on Jul 27, 2019 2:01 am IST

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మాస్ ప్రేక్షకులకి దగ్గరవడానికి అనుకూలించిన సినిమల్లో ‘రంగస్థలం’ కూడా ఒకటి. ఇందులో ఆమె హీరోయిన్ పాత్ర చేయకపోయినా స్పెషల్ సాంగ్ ‘జిల్ జిల్ జిల్ జిగేలురాణి’లో మెరిసింది. సినిమా ఎంత హిట్టైందో పాట కూడా అంతే హిట్. ఆ ఒక్క పాటతో మాస్ ప్రేక్షకుల్లో పూజా ఫాలోయింగ్ బాగా పెరిగింది. పాటలో అమె వేసిన పల్లెటూరి గెటప్ బి, సి సెంటర్లలో అలాగే రిజిస్టర్ అయిపోయింది. ఇప్పటికీ ఆడియన్స్ ఆమెను జిగేలురాణి అనే అంటారు.

అంతలా పాపులర్ అయిన ఆ పల్లెటూరి వేషధారణను తన ‘వాల్మీకి’ సినిమాలో కూడా హరీశ్ శంకర్ రిపీట్ చేస్తున్నారు. పాట కోసమో లేకపోతే సన్నివేశం కోసమో తెలీదుకానీ అచ్చు జిగేలురాణిని తలపించే వేషధారణను వేయించి, ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు హరీశ్. దీంతో సినిమాలో పూజా మీద మాంచి మాస్ మసాల సాంగ్ ఏదైనా ఉంటుందేమో అని ప్రేక్షకులు అంచనాలు వేసుకుంటున్నారు. ఇకపోతే వరుణ్ తేజ్, ఆధర్వ మురళీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :