అఖిల్ అనేసరికి పూజా హెగ్డే ఎక్కువ అడిగిందా ?

Published on Mar 25, 2020 6:59 am IST

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా పూర్తయ్యే దశలో ఉంది. కాగా ఈ సినిమా కోసం పూజా హెగ్డే ఎక్కువ రెమ్యునిరేషన్ అడిగిందట. పూజాకి వరుస హిట్స్ ఉండటంతో మేకర్స్ కూడా ఆమెకు ఎక్కువ రెమ్యునిరేషన్ ఇచ్చారట. అయితే పూజా ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడానికి కారణం అఖిల్ సరసన నటించడానికి ఒప్పుకున్నందుకేనని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇటీవ‌లే అఖిల్, పూజా హెగ్ధేల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్స్ కి సాంగ్ కు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యానర్ పై నిర్మాత‌ బ‌న్నివాసు నిర్మిస్తున్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More